ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలో శనివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరు పరమేష్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం, విద్యా వ్యక్తిత్వం, వికాసం కోసం, జల్ జమీన్, జల్ జంగల్ నినాదంతో ప్రజలను చైతన్యపరిచారని, స్త్రీ విద్యా వికాసం కోసం, మైనర్ స్కూల్లను ఏర్పాటు చేసి స్త్రీలు అన్ని రంగాలలో ముందుండాలని కృషి చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశ సాధన కోసం పనిచేయాలని పరమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాల్యం వెంకటాచలపతి, జాయింట్ సెక్రటరీ మొక్తాల నరసింహ, సీనియర్ న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, రిక్కల సుధాకర్ రెడ్డి, బడుగు శ్రీకాంత్, అన్నమల్ల నాగరాజు, జక్కర్తి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
