పిచ్చిమొక్కలు తొలగించారు

పిచ్చిమొక్కలు తొలగించారు
ఆంధ్రప్రభ వెబ్ కథనానికి స్పందన
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ వెబ్‌లో ప్రచురితమైన కథనానికి విద్యుత్ శాఖ వికారాబాద్ ఏడీఈ సత్యనారాయణ రెడ్డి స్పందించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాల చుట్టూ అల్లుకుపోయిన పిచ్చి మొక్కలను, చెట్లను తొలగించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఏడీఈ తెలిపారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు. వేసవిలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
