TG | ఇద్దరు మృతి

TG | ఇద్దరు మృతి
TG | ఆంధ్రప్రభ, వెబె డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్-పెద్దపల్లి బైపాస్ రోడ్డులో బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద కారు లారీని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద సమయంలో కారులో మొత్తం నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనా సమయంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయపడడంతో ఆసుపత్రికి తరలించబడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
