కాసిపేట యుపిఎస్ లో మాక్ గ్రామసభ..

కాసిపేట యుపిఎస్ లో మాక్ గ్రామసభ..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం కాసిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం 6 7 తరగతి విద్యార్థులు మాక్ గ్రామసభ నిర్వహించారు.సర్పంచ్ గా గంగాజల, ఉప సర్పంచ్ గా వరుణ్, పంచాయతీ కార్యదర్శి గా ఆకాంక్ష వ్యవహరించారు. గ్రామంలోని సమస్యలను వార్డు సభ్యులు సర్పంచి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు . ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా విద్యార్థులు చాలా చక్కగా మాట్లాడుతూ గ్రామంలోని వివిధ సమస్యలను వివరిస్తూ నిజ గ్రామసభ వలె వ్యవహరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ పలువురి ఆకట్టుకుంది.
