మంత్రి సహకారంతో కొల్లూర్ రూపురేఖలుమారుస్తా..

మంత్రి సహకారంతో కొల్లూర్ రూపురేఖలుమారుస్తా..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో కొల్లూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రామ రూపురేఖలు మారుస్తానని కొల్లూర్ సర్పంచ్ సింగారం సువర్ణ శ్రీనివాస్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూర్ లో జిపి నిధులు రూ. 2 లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తూ గ్రామంలో నెలకొన్న సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తాననిఅన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొల్లూరు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని మంత్రి సహకారంతో గ్రామానికి అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో డ్రైనేజీలు సిసి రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేసవిలో నీటి ఎద్దడి విద్యుత్ సమస్య తదితకుండా ప్రత్యేక కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కవిత, పంచాయతీ కార్యదర్శి తాజుద్దీన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply