ప్రజా ఆరోగ్యం పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి

ప్రజా ఆరోగ్యం పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్
మంథని, ఆంధ్రప్రభ : సామాజిక వైద్యశాలలు పనిచేసే వైద్యులు ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం మంథని మున్సిపల్ పరిధిలోని సామాజిక ప్రభుత్వ వైద్యశాలను చైర్మన్ శ్రీనివాస్ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి యొక్క వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అధిక సంఖ్యలో పేద ప్రజలు వస్తారని, వారికి అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందించడం మన బాధ్యత అని వైద్యులతో మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోగుల పట్ల వైద్యులు సానుకూల పద్ధతిలో స్పందించాలని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రికి, వైద్యులకు నిత్యం అందుబాటులో ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు మారుపాక నిహారిక నాగరాజు, ఎల్లంకి వంశీధర్, ఆస్పత్రి వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు వేముల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
