వైభవంగా కడెం సాయిబాబా ఆలయం వార్షికోత్సవం..

వైభవంగా కడెం సాయిబాబా ఆలయం వార్షికోత్సవం..

హోమయజ్ఞం కుంకుమ మార్చన పూజలు

కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కడెం పెద్దూరు సమీపంలో గల శ్రీ సాయిబాబా ఆలయం వారి 14 వ వార్షికోత్సవం వేడుకలను బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ధర్మపురి రమేష్ ఆచార్య తెలిపారు బుధవారం ఉదయం 5:30 గంటలకు సాయిబాబా వారి అభిషేకం 8:30 కు కుంకుమార్చన హవనం హోమం మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి భజన కార్యక్రమం నిర్వహించారు ఈ హోమయజ్ఞంలో పలువురు దంపతుల కుటుంబాలు కుంకుమార్చన పూజలో పలువురు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ వార్షిక ఉత్సవ వేడుకలకు హాజరైన భక్తులకు గ్రామాల ప్రజలకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం 5:30 గంటలకు శ్రీ సాయిబాబా వారి పల్లకి సేవ రాత్రి 10 గంటలకు శ్రీ సాయిబాబా శేష హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు డి.రమేష్ ఆచార్య తెలిపారు పై వేడుకల్లో పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ ఉప సర్పంచ్ పిట్టల రాజన్న జిపి వార్డు సభ్యులు పాల్గొని సాయినాథునికి ప్రత్యేక పూజలు చేశారుఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు మరియు పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply