అకాల వర్షంతో రైతులు ఆగమాగం..

అకాల వర్షంతో రైతులు ఆగమాగం..

నేల వాలిన వరి, మొక్క జొన్న,
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి డిమాండ్

బెజ్జంకి, ఆంధ్రప్రభ : అకాల వర్షం మండలంలోని రైతులను ఆగమాగం చేసిందని,నేల వాలిన వరి, మొక్క జొన్న, రాలిన మామిడికాయ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనీ భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు ముక్కిస అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోతకొచ్చిన వరితో పాటు మొక్కజొన్న నెలవాలగ మామిడికాయలు కొట్టుకుపోయాయి అని,అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేసి,ప్రభుత్వానికి అందజేయాలని, ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. రైతులకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని తెలిపారు. బాధిత రైతులకు పూర్తి స్థాయిలో పంట నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

Leave a Reply