పౌర హక్కులకు భంగం కలిగించోద్దు…

పౌర హక్కులకు భంగం కలిగించోద్దు…

టేకుమట్ల, ఆంధ్రప్రభ : సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని ఆర్ ఐ సంతోష్ అన్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఏం పేడు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఈసంపల్లి హారిక ఆధ్వర్యంలో మంగళవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూపౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాల వారు సోదరభావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సాయి చరణ్, ఉప సర్పంచ్ నేరెళ్ల తిరుపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఈసంపల్లి పోశాలు, మాజీ సర్పంచ్ కొలిపాక రాజయ్య, మాజీ సర్పంచ్ నరసయ్య, రికార్డ్ అసిస్టెంట్ పృథ్వి రాజు, జిపిఓ పరమేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, దుగ్యాల రమేష్, కొత్తపల్లి రాములు గ్రామస్తులు అధికారులు, పాల్గొన్నారు.

Leave a Reply