ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు..

ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు..

ఆలేరు, ఆంధ్రపభ : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మూడు రోజుల కాలజ్ఞాన ప్రవచనం పూజ కార్యక్రమాలలో భాగంగా ఆలేరు బీసీ కమ్యూనిటీ హాల్లో సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు బాలనాగమ్మ, చింతామణి, సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకాల ప్రదర్శన జరిగింది. నాటక ప్రదర్శన జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పౌరాణిక రంగస్థల నాటక కళాకారులు ఈ నాటకాలలో పాల్గొని తమ అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. కార్యక్రమ నిర్వాహకులు, నంది అవార్డు గ్రహీత టి రాముతో పాటు ప్రఖ్యాత రంగస్థలం నాటక కళాకారులు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply