వైద్యులు లేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్న రోగులు..

వైద్యులు లేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్న రోగులు..

మొగుళ్ళపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్యులు విధులకు రాకపోవ డంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆరోగ్య సమస్యల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఎన్ సి డి స్టాఫ్ నర్స్ మినహా ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఎవరు రాకపోవ డంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యతో వచ్చే పేషెంట్ ను చూడడానికి డాక్టర్ లేకపోవడంతో ఎవరికి చూపించుకోవాలో తెలియక గంటల కొద్ది ఎదురుచూసి ఇంటి దారి పడుతున్నారు. ప్రజలకు ఉచిత వైద్యం అందాల్సిన వైద్యులు రాకపోవ డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ సంబంధిత డిఎంహెచ్ఓ, స్పందించి డాక్టర్స్ మరియు సిబ్బందిపై తగుచర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply