పొన్కల్ లో సిసి రోడ్డు పనులు ప్రారంభం….

పొన్కల్ లో సిసి రోడ్డు పనులు ప్రారంభం….
మామడ, ఆంధ్ర ప్రభ : మండలంలోని పొన్కల్ గ్రామంలో రూ.15 లక్షల ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో నిర్మించే సిసి రోడ్డు పనులను ఉప సర్పంచ్ పార్ పెల్లి రాజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, వార్డ్ సభ్యులు కొరిపెల్లి సుధాకర్ రెడ్డి,రెబ్బాస్ రాజేశ్వర్,పత్తిరి రాజన్న,నాయకులు చిట్యాల రాజారెడ్డి,కాలగిరి గంగారెడ్డి, కొండ్ర రాజారెడ్డి, మంగు లింగన్న, రెడ్డి నర్సారెడ్డి, వడ్ల నరేష్,అట్ల ఉమేష్ రెడ్డి, కొరిపెల్లి ముత్యం రెడ్డి, కటకం సుదర్శన్,సిలివెరీ నందు,రహీం, నర్సయ్య, ఉన్నారు.
