బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు….

బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు….

డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : పట్టణంలోని 2 వ వార్డు కు చెందిన సీనియర్ నాయకుడు మోతే నరసింహ నాయకత్వంలో సుమారుగా వంద మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను మోసపోయామని చాలామంది కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీల నాయకులు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు ప్రతి ఒక్కరికి ఆయన పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య , పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు ముక్కెర్ల సతీష్ యాదవ్, నాయకులు బాలయ్య గౌడ్ రాజేష్ యాదవ్, నర్సింగం పురుషోత్తం, మోతే బాలు తదితరులు పాల్గొన్నారు

పార్టీలో చేరిన వారు…

మోతే నరసింహ, మోతే విజయ్, శ్రీరాములు, తూర్పాటి బాల నరసింహ, తూర్పాటి శంకర్ శంకర్, మిర్యాల నాగార్జున, కళ్యాణ్, దావీద్, సల్ల ప్రవీణ్ మోతే స్వామి, కళ్లెం మల్లేష్ పరశురాం తో కలిసి సుమారు 100 మంది చేరారు..

Leave a Reply