పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత..

వికారాబాద్, ఆంధ్రప్రభ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి సూచించారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31 వ వార్డు శివరాం నగర్ లో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని 31 వ వార్డుమున్సిపల్ కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగిస్తామని అన్నారు. మున్సిపల్ పరిషత్ సిబ్బందికి ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా అందించాలని ఆయన సూచించారు.

31 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ అధికారులకు ప్రజలు సహకరిస్తే త్వరితగతిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాస్ మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కలిగి ఉన్నప్పుడే తడిచితలు పొడి చెత్తను మున్సిపల్ సిబ్బంది స్వీకరించగలుగుతారని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాల డంపింగ్ యార్డ్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాలే లక్ష్మణ్,ఎన్విరాన్మెంట్స్ ఇంజనీర్ శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్ ఆర్ పి విజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply