బోధన్ డివిజన్ ఆత్మా చైర్మన్ గా ఎడపల్లి మండల వాసి ఏకగ్రీవం

బోధన్ డివిజన్ ఆత్మా చైర్మన్ గా ఎడపల్లి మండల వాసి ఏకగ్రీవం
ఎడపల్లి, ఆంధ్రప్రభ : బోధన్ లో డివిజన్ స్థాయి వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మా) ఆద్వర్యం లో సోమవారం బ్లాక్ లెవెల్ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. బోధన్ డివిజన్ ఆత్మా చైర్మన్ గా ఎడపల్లి మండలానికి చెందిన వక్కలపూడి కృష్ణారావ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఏ.డి.ఏ సంతోష్ తెలిపారు. కమిటీ లో చైర్మన్ తో సహా ఐదు మండలాలకుg చెందిన 25 మంది రైతులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో వివిధ మండలాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
