రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్..

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లో శనివారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉట్నూర్ పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జరిగిన వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానం చేయగా ఎమ్మెల్యే ముస్లిం నాయకులకు సన్మానం చేసి ఆప్యాయతగా అలింగణం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ముస్లిం సోదరులు తమ బంధువుల ఇంటికి వెళ్లి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముస్లిం సోదరులు కుటుంబ సభ్యుల సమేతంగా ఇండ్లలో నమాజ్ ప్రార్థనలు చేసి పండుగ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో అదిలాబాద్ ఆర్టీఏ నెంబర్ దూట రాజేశ్వర్, ఆదిలాబాద్ డిసిసి ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, సయ్యద్ ఏక్బాల్, వివిధ పార్టీల నాయకులు, మైనార్టీ సంఘాల నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Leave a Reply