ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు..

ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు..
రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్
ఖమ్మం, ఆంధ్రప్రభ : ముస్లిం సోదరులకు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన,దాతృత్వం, ప్రేమ,దయ,సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయి అన్నారు.
