చిట్యాల పట్టణంలో పౌర సరఫరాల శాఖ దాడులు..

చిట్యాల పట్టణంలో పౌర సరఫరాల శాఖ దాడులు..
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా జిల్లా పౌర సరఫరాల అధికారి పి. వెంకటేష్ ఆదేశాల మేరకు మంగళవారం చిట్యాల పట్టణంలోని పలు హోటళ్లు, ధాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు రీఫిల్లింగ్ కేంద్రాలపై సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాల కోసం అక్రమంగా గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్న కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న 15 గృహ వినియోగ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6A సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏ దీపక్, ఆర్. సైదులు గౌడ్, ఆర్. జ్యోతి, ఎస్.డి. ముబీన్. ఎస్. రవీందర్ రెడ్డి, ఎ. సైదులు, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
