కార్యకర్తలకు శిక్షణ తరగతులు..

కార్యకర్తలకు శిక్షణ తరగతులు..

హాజరైన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి ,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్ ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి , మూడు మండలాల బిజెపి నాయకులు, కార్యకర్తలకు , పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 శిక్షణ తరగతులునిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలకు సమగ్ర మార్గదర్శనం చేస్తూ, పార్టీ సిద్ధాంతాలు, కార్యాచరణ, ప్రజా సేవా దృక్పథంపై అవగాహన కల్పించారు. పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో, సేవాభావంతో పనిచేస్తేనే పార్టీ బలపడుతుందని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు . గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ బలపడటానికి శిక్షణ తరగతులు అత్యంత కీలకమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతన నిషేధర్ రెడ్డి , బిజెపి రాష్ట్ర నాయకులు నాగపురి రాజమౌళి గౌడ్, రాష్ట్ర నాయకులు వెన్నం పెళ్లి పాపయ్య, చదువు రామచంద్ర రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి రవికిరణ్ ,మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి ,గుర్రపు నాగరాజుగౌడ్ సర్పంచులు, ఉప సర్పంచులు, గొర్రె శేషి కుమార్, తిరుపతి, శ్రీధర్, కుమారస్వామి, జరుపూల శ్రీను ,రాజేందర్ , జిల్లా, మండల నాయకులు, మోరే రవీందర్ రెడ్డి, తీగల జగ్గయ్య, చెక్క నరసయ్య, మండల మొగిలి, దేశెట్టి గోపాల్, కూర మైపాల్ రెడ్డి మైదం శ్రీకాంత్, చింతల రాజేందర్, కేంసారపు ప్రభాకర్, రాయిని శ్రీనివాస్, గాజనాల రవీందర్, గోపగాని స్వామి, నీలి సుధాకర్ రెడ్డి, శ్రావణ్,ప్రశాంత్ ,వెంకటేశ్వర్లు , ఉడుత వనక్క, నగవత్ పూర్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply