ఖానాపూర్ మాజీఎమ్మెల్యే మృతి..

ఖానాపూర్ మాజీఎమ్మెల్యే మృతి..

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్ అనారోగ్యంతో దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని తన స్వగృహంలో సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. గోవింద్ నాయక్ ది దండేపల్లి మండలం అయినప్పటికీ ఖానాపూర్ నియోజకవర్గం నుండి 1985 లో స్వతంత్ర అభ్యర్థిగా, 1994 తెలుగుదేశం, 2004 లో టిఆర్ఎస్ అభ్యర్థిగా మూడుసార్లు గెలుపొందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవింద్ నాయక్ తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్యే మృతి చెందారని తెలుసుకున్న బందువులు, ఆయన అభిమానులు శోకసముద్రంలో మునిగారు. ఆయన మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్యా అనూష బాయి, కుమారులు అరవింద్ నాయక్, మిలన్ నాయక్, చందన్ నాయక్ ఉన్నారు.

Leave a Reply