మూగ జీవులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి..

మూగ జీవులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి..

కడెం, ఆంధ్రప్రభ : పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించుకోవాలని కడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ పి.సౌందర్య సారంగాపూర్ గ్రామ సర్పంచ్ కోల తేజస్విని శ్రీనివాస్ అన్నారు మంగళవారం కడెం మండలంలోని సారంగాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పశువుల ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరము సారంగాపూర్ గ్రామ సర్పంచ్ కోల తేజస్విని ప్రారంభించారు. కడెం మండలంలోని పశువులకు దూడలకు, ఆవులు, గేదెలకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని ఈ టీకాలు మండల పశువుల పెంపకం దారులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పి. సౌందర్య స్థానిక కోల తేజస్విని కోరారు.

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేయడం వలన వ్యాధి నుంచి రక్షించుకోవడమే కాకుండా పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి పెరుగుతుందని వారు అన్నారు . మండలంలోని అన్ని గ్రామాలల్లో ఏప్రిల్ 9 వరకు ఈ కార్యక్రమంజరుగుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలోని పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ వైద్య శిబిరంలో స్థానిక ఉపసర్పంచ్ కుమ్మరి రమేష్ పంచాయతీ కార్యదర్శి వై రాజు జిపి వార్డు సభ్యులు జె వి ఓ జే రాజేశ్వర్ పశు వైద్య సిబ్బంది విజయ హరీష్ రాజేశ్వర్ బి రమేష్ మల్లేష్ మదన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply