ఉట్నూర్ ఏజెన్సీ మండలాల్లో రైతు యాత్ర..

ఉట్నూర్ ఏజెన్సీ మండలాల్లో రైతు యాత్ర..
గ్రామాల్లోభరత్ చవాన్ కొనసాగిస్తున్న రైతు యాత్ర
ఉట్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల కు ఇవ్వాల్సిన రైతు బంధు రైతు కూలీల సహాయం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ మండలాల్లో రైతు యాత్ర పేరిట గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును వివరిస్తున్నారు. ఆదివారంఉట్నూర్ మండలంలోని కొత్తగూడ గ్రామంలో పర్యటించిఈ సందర్భంగా రైతుల,రైతు కూలీలతో సమావేశం నిర్వహించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు అస్తవ్యస్తంగా ఉన్న_ విద్యుత్ తీగల ను బాగు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనేరైతుబంధు, కూలీల సహాయ నిధులు వెంటనే విడుదల డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లలో రైతుల సమక్షంలో కేసులు పెడతామని హెచ్చరించారు. రైతులకు ప్రజలకు అండగా ఉంటానని హామీ చారు. ప్రభుత్వం రైతులకు రైతుబంధు సహా డబ్బులు చెల్లించక రైతుల ఇబ్బందులు పడుతున్నారని డబ్బులు చెల్లింపులో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆయన విమర్శించారు.ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు కుడుమేత బండు, చాకటి శంభు, కుడిమెత బాదు, చాకటి మహదు, కుడిమెతరతన్, సామాజిక కార్యకర్త ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
