మిత్రుని కుటుంబానికి ఆర్ధిక సహాయం..

మిత్రుని కుటుంబానికి ఆర్ధిక సహాయం..
మర్రిగూడ, ఆంధ్రప్రభ : దామేర బీమనపల్లి గ్రామానికి చెందిన జంపాల నాగరాజు ఇటీవలే అనారోగ్యానికి గురై మరణించడం జరిగింది. 2002సంవత్సరంలో కలిసి పదోవ తరగతి చదువుకున్న తోటి మిత్రులకు ఈ విషయo తెలియడంతో వెంటనే స్నేహితులందరు కలిసి శుక్రవారం అతని నివాసానికి వెళ్లి అతని భార్య, కుమారునికి యాభైవేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వనమాల మహేష్, చిత్రపు గణేష్, దాసరి అశోక్, మెట్టు రమేష్, మధు, రఘుమారెడ్డి, వెంకట్, చంద్రశేఖర్, శ్రీను, నగేష్, సైదులు, రామకృష్ణ పాల్గొన్నారు.
