హై స్కూల్ విజేతలకు సన్మానం..

హై స్కూల్ విజేతలకు సన్మానం..

విజేతలను సన్మానించిన ప్రిన్సిపాల్ దాసి సతీష్

కరీమాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాదులో జరిగిన సీఎం కప్ పోటీలలో వరంగల్ కరీమాబాద్ అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన కివి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు వివిధ పథకాలు సాధించి నగదు పారితోషకాన్ని కూడా గెలుచుకున్నారు. కిక్ బాక్సింగ్ పోటీలలో సల్ల.సాత్విక్ ద్వితీయ బహుమతి సిల్వర్ మెడల్ 15000 రూపాయల పారితోషికం. యోగా పోటీలలో తుమ్మ.పవన్ కుమార్ ద్వితీయ బహుమతి,సిల్వర్ మెడల్.15 వేల పారితోషికం జూడో పోటీలలో పల్లకొండ.సచిన్ బ్రాంజ్ మెడల్,10000 పారితోషికం గెలుపొందారు. ఇట్టి పోటీలలో మూడు విభాగాలలో మెడల్ పారితోషికం గెలుచుకోవడం ఆనందంగా ఉందని పాఠశాల ప్రిన్సిపల్ దాసి.సతీష్ మూర్తి. తెలిపారు సన్మాన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అన్నదేవర ప్రవీణ్ కుమార్,యోగా శిక్షకులు జి రవితేజ,కిక్ బాక్సింగ్ కోచ్ బి.సంతోష్,జూడో కోచ్ ఎన్.కుమారస్వామి ఇతర అధ్యాపక బృందం ,విద్యార్థిని విద్యార్థులు,పాల్గొన్నారు.

Leave a Reply