TG | గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి…

TG | గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి…

TG | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అమీన్ పూర్ సర్పంచ్ టప్ప నాగేష్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమీన్ పూర్ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు దశలవారీగా పరిష్కరిస్తానని అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేయాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల తర్వాత గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. అనంతరం గ్రామంలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని, గ్రామంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించాలని, వ్యవసాయ పొలాలకు వెళ్లి రోడ్లు ఉపాధి హామీ పథకంలో చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ మహాలక్ష్మి, మాజీ ఎంపీటీసీ అనిత శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply