ప్రతి విద్యార్థులో గొప్ప శాస్త్రవేత్త..

ప్రతి విద్యార్థులో గొప్ప శాస్త్రవేత్త..
శాస్త్రీయంగా విద్యార్థులు ఆలోచించాలి
కాకతీయ పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి
మంథని, ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థుల ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుందని, ప్రతి విద్యార్థులకు గొప్ప శాస్త్రవేత్త దాగి ఉంటాడని, విద్యార్థులందరూ శాస్త్రీయంగా ఆలోచించాలని కాకతీయ పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. నేషనల్ సైన్స్ ఒలంపియాడ్, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ పరీక్షలలో కాకతీయ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంగళవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అంజని మిశ్రా హాజరయ్యారు. విద్యార్థుల్లో సైన్స్, గణితం పట్ల ఆసక్తిని పెంచడానికి సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ వారు నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఒలంపియాడ్ పరీక్షలైన జాతీయ సైన్స్ ఒలంపియాడ్, అంతర్జాతీయ మ్యాస్ ఒలంపియాడ్ పరీక్షల్లో కాకతీయ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

ఎన్ఎస్ఓ టాలెంట్ టెస్టులో 200 మంది విద్యార్థులు పాల్గొని 146 మంది విద్యార్థులు సెకండ్ లెవెల్ కి ఉత్తీర్ణత సాధించారు. 128 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. ఐఎంఓ పరీక్షలో 248 విద్యార్థులు పాల్గొనగా 74 మంది విద్యార్థులు సెకండ్ లెవెల్ కి ఉత్తీర్ణత సాధించగా అందులో 44 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. విద్యార్థులకు ప్రతిభ సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రధానం చేశారు. ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ…. తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడి సాధన చేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని సూచించారు. విద్యార్థులు తమ జీవితంలో గొప్ప శాస్త్రవేత్తల వలె ఎదిగి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్య అతిథి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అంజని మిశ్ర మాట్లాడుతూ…. విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. చదువుతోపాటు మంచి నైతిక విలువలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంథని సిఆర్పి మల్లయ్య, పాఠశాల డైరెక్టర్లు రవికిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, స్రవంతి రెడ్డి, పావని రెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
