ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమాలు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమాలు..
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాల యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భేతి సంతోష్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా సోమవారం రోజు కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు అధ్యాపకులు కళాశాలలోని తరగతి గదులను మరియు బెంచీలను పరిశుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా కళాశాల ఆవరణలోని చెట్లపొదలను, పిచ్చి మొక్కలను, చెత్తచేదారాలను తొలగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వచ్ఛభారత్ అనే అంశంపై మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు ప్రభావం ఉండదని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను చైతన్యవంతం చైతన్య పరచడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్లు ప్రజలను చైతన్యం చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అన్నం శ్రీనివాస్ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ మల్లయ్య, స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ అల్లిశాల అశోక్, డాక్టర్ కల్పన, బి మహేందర్ రావు, డాక్టర్ టి భీమ్రావు, డాక్టర్ జి పావని, డాక్టర్ ఏ రమేష్, డాక్టర్ జి రామకృష్ణ, ఎం సమ్మయ్య, ఎస్ రాజశ్రీ, డాక్టర్ జి రాజేశ్వరరావు, డాక్టర్ జి స్వప్న, డాక్టర్ డి సంజయ్ కుమార్ మరియు పవన్ కుమార్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నాన్ టీచింగ్ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
