అధ్యాపకులు ఆచార్యులుగా పదోన్నతి

అధ్యాపకులు ఆచార్యులుగా పదోన్నతి
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆచార్యులుగా పదోన్నతి పొందారు. పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ బేతి సంతోష్ కుమార్ మరియు చరిత్ర అధ్యాపకులు డాక్టర్ నల్ల మల్లయ్యకు ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఏ శ్రీదేవసేన ఉత్తర్వులను జారీ చేశారు ఈ సందర్భంగా అధ్యాపక బృందం పదోన్నతి పొందిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ భేతి సంతోష్ కుమార్ మరియు ప్రొఫెసర్ మల్లయ్య కు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. ప్రొఫెసర్ మల్లయ్య 2025 లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు కూడా పొందడం విశేషం.
ఈ కార్యక్రమంలో ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎలిషాల అశోక్ , అధ్యాపకులు డాక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ టి కల్పన, డాక్టర్ టి భీమ్ రావు, బి. మహేంద్రరావు, డాక్టర్ జి పావని, డాక్టర్ ఆడెపు రమేష్, డాక్టర్ కె జగదీష్ బాబు, ఎం. సమ్మయ్య, ఆర్ ఈశ్వరయ్య, ఎస్ రాజశ్రీ, కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ జి రాజేశ్వర్ కుమార్, డాక్టర్ జి స్వప్న, డాక్టర్ సంజయ్, అలేఖ్య , పవన్ అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని వారికి అభినందనలు తెలియజేశారు.
