TG | కడెం ప్రీమియర్ లీగ్ సీజన్-2 విన్నర్ గా గేమ్ చేంజర్స్

TG | కడెం ప్రీమియర్ లీగ్ సీజన్-2 విన్నర్ గా గేమ్ చేంజర్స్

  • రన్నర్ గా గరుడ వారియర్స్
  • ముగిసిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు

TG | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా గత 10 రోజుల నుండి కడెం క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో నిర్వహించారు. ఇందులో 8 క్రికెట్ జట్లు పాల్గొన‌గా… ఫైనల్ లో గరుడ వారియర్స్ వర్సెస్ గేమ్ చేంజర్స్ తలబడగా.. గేమ్ చేంజర్స్ జట్టు విజయం సాధించింది. మొదటి బహుమతి గేమ్ చేంజర్స్ జట్టుకు రూ.20వేల నగదు, ట్రోఫీ, రెండవ బహుమతిని గరుడ వారియర్స్ కు రూ.10వేల నగదు, ట్రోఫీ కడెం పెద్దూర్ గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ కడెం పి ఎస్ ఎస్ ఐ ఎస్సై పి సాయి కిరణ్ చేతుల మీదుగా అందజేశారు.

ఈసందర్భంగా పెద్దూర్ గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ… యువత, క్రీడలతో చదువులో రాణించాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద బెల్లాల్, చిట్యాల్ గ్రామాల సర్పంచులు ఈదుల తిరుపతి, చీమల భీమేష్, నిర్వాహకులు పొద్దుటూరి సంపత్ రెడ్డి, పిట్టల రాజన్న, శ్రీరామ్, చోటు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పి. సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఏం మల్లేష్ యాదవ్, కడెం మాజీ వైస్ ఎంపీపీ కట్ట శ్యామ్, తెలంగాణ బీసీ యూత్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వెంకటరమణ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఇస్లావత్ గంగన్న అజ్మీరా శంకర్ నాయక్, జీల నాగరాజు ముబారక్, బీజేపీ మండల నాయకులు ముక్కెర గంగాధర్ గడప దేవరాజ్, కడెం మత్స్యశాఖ ఎఫ్ డి ఓ విజయ కిరణ్ కార్, ఎఫ్ బి ఓ చింతకుంట రవి, కడెం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply