2 వార్డులో సమస్యలను పరిశీలిస్తున్న అధికారులు.

2 వార్డులో సమస్యలను పరిశీలిస్తున్న అధికారులు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం
నర్సంపేట. ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను పరిష్కరిస్తేనే ఉద్దేశ్యంతో వార్డుల పర్యటన చేపట్టడం జరుగుతుందనీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి రామానంద్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ అన్నారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డులో స్థానిక కౌన్సిలరు కాంపెల్లి వీణ-విజేందర్ రెడ్డి తో కలిసి శుక్రవారం పర్యటించారు. ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ 2వ వార్డులో అధికారులతో కలిసి పర్యటించడం జరిగిందన్నారు, ప్రజా సమస్యలే ద్యేయంగా పని చేస్తామని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉదయం నుండి వార్డులో పర్యటిస్తున్నప్పుడు తమ దృష్టికి అనేక సమస్యను పరిశీలించామని, వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
2వ వార్డులో స్థానిక కౌన్సిలరు వీణ-విజేందర్ రెడ్డితో వార్డులో పర్యటిస్తున్న ప్పుడు వార్డులో ముఖ్యంగా వాటర్ సమస్య ఉందని గుర్తించడం జరిగిందని, పాడైపోయిన బోర్లు అలాగే బావులు రిపేర్ చేయించి అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టామని త్వరలోనే బావులు బోర్ల ద్వారా నీటిని అందిస్తామని వివరించారు. వార్డులో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెడతామని వార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అధికారులకు సిబ్బందికి వార్డుల్లో ఎక్కడ సమస్య ఉన్న మీ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి తమ దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, సానిటేషన్ ఎస్సై శ్యామ్, 3వ వార్డు కౌన్సిలరు ముత్తినేని వెంకన్న, 4వ వార్డు కౌన్సిలరు బీరం భరత్ రెడ్డి, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ యుగంధర్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల నవీన్, చిదురాల రాంరెడ్డి, దూపటి కుమార్, కేశపాక సాంబయ్య, ఎండీ రజాక్, రహీంలు పాల్గొన్నారు.
