కానిస్టేబుల్ కి సన్మానం

కానిస్టేబుల్ కి సన్మానం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వినోద్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పై జిల్లా టాస్క్ ఫోర్స్ జనగాం కు బదిలీ కాగా, మోత్కూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రవిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ వినోద్ సింగ్ కి పూలమాలలు, శాలువలతో శుక్రవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ లు పి సత్య నారాయణ, కె క్రాంతి , హెడ్ కానిస్టేబుల్ సుభాష్ రెడ్డి, కానిస్టేబుల్ లు అజీజ్ ఊర్ రెహ్మాన్, రమేశ్ రెడ్డి, వెంకటేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply