TG | ఉపాధి పనుల్లో రికార్డులపై ప్రజాదర్బార్

TG | ఉపాధి పనుల్లో రికార్డులపై ప్రజాదర్బార్

రూ.58 వేల రికవరీ, రూ.49 వేల జరిమానా

TG | రాయపోల్, ఆంధ్ర ప్రభ : ఉపాధి హామీ పథకంలో పనులు పారదర్శకంగా జరగాలని జిల్లా అడిషనల్ పీడీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రాయపోల్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన 4వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజా దర్బార్ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 230 పనులు చేపట్టి రూ.3 కోట్ల 95 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. 19 గ్రామ పంచాయతీల పరిధిలో జరిగిన పనుల వివరాలను గ్రామపంచాయతీ వారిగా ప్రజాదర్బార్లో వెల్లడించారు. సామాజిక తనిఖీలో పలు గ్రామాల్లో రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.కొందరు టీసీలు,కొందరు పంచాయితీ సెక్రిటరీలు,ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రూ.58 వేల రికవరీకి,మరో రూ.49 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. ఇకపై రికార్డులు, జాబ్ కార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, కూలీలకు ఇబ్బందులు లేకుండా ఉపాధి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Leave a Reply