TG | వరంగల్ లో హోమియో, డెంటల్ కళాశాల ఏర్పాటు చేయాలి

TG | వరంగల్ లో హోమియో, డెంటల్ కళాశాల ఏర్పాటు చేయాలి

.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్

TG | కరీమాబాద్, ఆంధ్రప్రభ: వరంగల్ లో హోమియోపతి, డెంటల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా 26వ మహాసభలు గిర్మాజీపేట లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కమిటీ సభ్యుడు పనస ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి కనీసం సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని వారన్నారు తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని వారు అన్నారు కేంద్ర బడ్జెట్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అంకెలు పెరిగినప్పటికీ బడ్జెట్ మాత్రం విద్యారంగానికి నిరాశ కలిగించిందని అన్నారు.

ఏఐఎస్ఎఫ్ తీర్మానాలను తీసుకున్నారు…..

1) ప్రభుత్వ రంగంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలని 2) వరంగల్ లో ప్రభుత్వ హోమియోపతి దంత వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి 3) సంక్షేమ హాస్టళ్లకు ఉత్త భవనాలు నిర్మించాలని 4) ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం 8 మందితో జిల్లా కౌన్సిల్ 21 మందితో ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా దిడ్డి పార్థసారథి ఉపాధ్యక్షుడిగా సిహెచ్ హరీష్ జిల్లా ఉపాధ్యక్షుడు భరత్ జిల్లా కార్యదర్శిగా ల్యాదళ్ల శరత్ సహాయ కార్యదర్శిగా శివ, పాలక పవన్, కోశాధికారి మేకల అభిరామ్ ,జిల్లా కమిటీ సభ్యులు నిఖిల్ రమేష్ సంతోష్ ప్రభాస్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply