సొంత నిధులతో అభివృద్ధి చేసి చూపించాం…

సొంత నిధులతో అభివృద్ధి చేసి చూపించాం…

కార్పొరేషన్‌లోనూ అదే ముద్ర!
గుమాల్ మమతకు అవకాశం ఇవ్వండి..డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

మహబూబ్ నగర్, ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గుమాల్ మమత కార్పొరేటర్ అభ్యర్థి తరఫున ఆమె భర్త గుమాల్ శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో ఎలాంటి పదవులు లేకపోయినా సొంత నిధులతో డివిజన్ అభివృద్ధికి కృషి చేశానని, ప్రజల నమ్మకాన్ని పనుల ద్వారానే సంపాదించుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు తన సతీమణి గుమాల్ మమతను కార్పొరేటర్‌గా గెలిపిస్తే, సొంత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.సొంత మేనిఫెస్టోలో విద్య, వైద్య రంగాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. డివిజన్‌లో గ్రంథాలయ నిర్మాణం, 3వ డివిజన్ పరిధిలో బస్తీ దవాఖానా ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అభివృద్ధి, విద్యార్థులకు ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ల ఏర్పాటు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి.

అలాగే వర్షాకాలంలో నీటి నిల్వల వల్ల ఏర్పడే సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
డివిజన్ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి గల్లీలో అండర్ డ్రైనేజీ ఏర్పాటు, వీధుల శుభ్రత, ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్స్, ఓపెన్ జిమ్, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, క్రీడాకారుల కోసం బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన వృద్ధులకు పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రతి అర్హుడికి అందేలా ముందుండి పనిచేస్తామని తెలిపారు.
డివిజన్‌లో ఉన్న సమస్యలను ప్రజలతో కలిసి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఆపద సమయాల్లో ప్రజలకు చేదోడువాదోడుగా ఉంటామని గుమాల్ శ్రీనివాసులు భరోసా ఇచ్చారు. అభివృద్ధి, సేవ, నిబద్ధతే తమ ఎన్నికల నినాదమని పేర్కొంటూ, గుమాల్ మమతకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.

Leave a Reply