TG | కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

TG | కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

-ఎన్నికల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు
-స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రత్యేక దృష్టి
-ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ చర్యలకు తావు లేదు
-స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ను సందర్శించిన డీసీపీ

TG | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిం చేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఎన్నికల నేప థ్యంలో ఆదివారం ఏసీపీ భీం శర్మతో కలిసి జనగామ డీసీపీ రాజమ హేంద్ర నాయక్ తో పాటు ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ సెంటర్ ను ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పా టు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్ సిబ్బంది నియామకం, ప్రవేశ విధానాలను డీసీపీ సవివరంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలా గే కౌంటింగ్ సెంటర్‌లో కౌంటింగ్ రోజున అమలు చేయాల్సిన భద్రతా చర్యలు, వాహనాల నియంత్రణ, అభ్యర్థులు, ఏజెంట్ల ప్రవేశ విధానం, శాంతి భద్రతల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నా లను సహించబోమని, చట్టవిరుద్ధ చర్యలపై కఠినంగా వ్యవ హరిస్తా మని డీసీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ జి. వేణు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply