TG | పడకేసిన ప్రభుత్వ వైద్యం..

TG | పడకేసిన ప్రభుత్వ వైద్యం..

అందుబాటులో లేని వైద్యులు
అవస్థలు పడుతున్న రోగులు

TG |వాజేడు, ఆంధ్రప్రభ : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రభుత్వ వైద్యుల తీరు మారడం లేదు వైద్య అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ వైద్యం పడకేసింది ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వైద్యం అందించాల్సిన వైద్యాధికారులు అందుబాటులో లేకుండా నిర్లక్ష్యాన్ని అవలంబిస్తున్నారు. కేవలం స్టాఫ్ నర్స్ మాత్రమే ఆసుపత్రిలో అందుబాటులో ఉండి రోగులకు తమ స్థాయిలో వైద్యం అందిస్తున్నారు. ఎందుకు ఉదాహరణగా శుక్రవారం వాజేడు మండల పరిధిలోని కొప్పుసూరు గ్రామానికి చెందిన సోయం రాజ్యలక్ష్మి అనే మహిళ పురుగుమందు తాగింది అది గమనించిన కుటుంబ సభ్యులు వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు హుటాగొట్టిన తరలించారు.

అక్కడ వైద్యం అందించడానికి వైద్య అధికారులు ఒక్కరు కూడా అందుబాటులో లేరు దీనితో స్టాఫ్ నర్స్ అటెండర్ మాత్రమే ఆమెకు ప్రథమ చికిత్స నిర్వహించి ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశారు. అత్యవసర పరిస్థితిలో కూడా వైద్య అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. వాజేడు వైద్యశాల కు ఇద్దరు డాక్టర్లు ఉన్నప్పటికీ రోగులకు మాత్రం వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విధులకు డుమ్మాకొడుతూ సొంత పనులు చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాను జీతం రూపంలో కాజేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి వైద్యులు విధులు నిర్వహించకుండా కిందిస్థాయి సిబ్బందితో రోగులకు మందులు అందజేస్తూ కాలం గడుపుతున్నారు.

వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలంటేనే రోగులు భయాందోళనకు గురవుతున్నారు అక్కడి డాక్టర్లు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు అందుబాటులో ఉండరు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది దీనితో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలంటేనే వద్దుబిడ్డ ప్రభుత్వ దావకానకు అనే పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడి వైద్యాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడం ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకపోవడం తో ఇక్కడి వైద్యాధికారుల నిర్లక్ష్యం రోజు రోజుకు మితిమీరుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ చేసి నిర్లక్ష్యపు వైద్యులపై చర్యలు తీసుకుంటే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply