TG | యూరియా కోసం ఆన్లైన్ నమోదు…

TG | యూరియా కోసం ఆన్లైన్ నమోదు…
- రైతులకు తప్పని యూరియా పాట్లు…
- పంటలు చేతికి అందేనా….
- ఆందోళన చెందుతున్న మండల రైతులు….
TG | శంకరపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వము యూరియా కోసం ఓ సాఫ్ట్వేర్ ను రూపొందించి రైతులు యూరియా దిగుమతి కోసం యాపునే సంప్రదించి కొనుగోలు చేయాల్సిన నూతన ఓరవడితో మండల రైతులు యూరియా కోసం అనేక తిప్పలు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మండల రైతులు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో 27 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మండలంలో అధిక శాతం వరి పంట సాగు చేశారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రైతులు నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారని, స్మార్ట్ ఫోన్ వినియోగించని రైతులే అధికంగా వ్యవసాయం చేస్తున్నారని, వరి పంటకు సకాలంలో రైతులు యూరియా అందించి పంటలు కాపాడుకోవాల్సి వస్తుందని, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఆన్లైన్ యూరియా నమోదు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆన్లైన్లో రైతు పేరు నమోదు చేసుకుంటేనే యూరియా దిగుమతి చేస్తామని విక్రయదారులు హుకుం జారీ చేయడంతో పంటలు వేసి నెలలు గడుస్తున్నా వరి పంటలకు యూరియా అందించక వేసిన పంటలు చేతికి అంది వస్తాయో రావోనని దిగులు చెందుతున్నామని, శంకరపట్నం మండలంలో యూరియా కోసం రైతులు యాప్ ను వినియోగిస్తే యాప్ లో సాంకేతిక లోపంతో రైతులకు యూరియా టిప్పలు మండలంలో తప్పడం లేదని, ఇప్పటికైనా పాలకులు ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని రైతులకు యూరియా సకాలంలో అందించి వేసిన పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పూర్వము యూరియా ఎలా విక్రయించారో అలా రైతులకు సకాలంలో యూరియా అందించి ఆదుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే రైతులందరం సంఘటితమై ఆందోళనలు చేస్తామని చరించారు.
