TG | ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతా

TG | ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతా

  • 30వ వార్డు అభ్యర్థి గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు

TG | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణ 30వ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఆదరించాలని 30వ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తుపై వేసి గెలిపించాలని వార్డు ప్రజలను వారు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారం, ఆశీర్వాదంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్, రాజు, అఖిల్, తూర్పు ఆంజనేయులు, తుల్జారామ్, శ్రీధర్ రెడ్డి, నరసన్న, దేవదాస్ కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply