TG | ప్రజా సమస్యలు తీరుస్తా..

TG | ప్రజా సమస్యలు తీరుస్తా..

  • ఆశీర్వదించి గెలిపిస్తే.. అభివృద్ధి పరుస్తా..!
  • 11 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి కారుపోతుల వెంకన్న

TG | మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రజల కష్టాలు తెల్సినవాడిని.. ప్రజా సమస్యల తీర్చేవాడిని.. నన్ను ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే… వార్డును అభివృద్ధి పరుస్తానని 11 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి కారుపోతుల వెంకన్న గౌడ్ ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని… నికార్సైన కార్యకర్తగా ఉన్న తనకు పార్టీ అధిష్టానం గుర్తించి.. 11 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా బి ఫామ్ ఇవ్వడం సంతోషకరమన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే… తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాను అన్నారు.

11 వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి.. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని, ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తు పై ఓటేసి ఓటర్లు తనను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాను ఇప్పటికే ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని నిరుపేదలకు సేవలు అందించానని… ప్రభుత్వ సంక్షేమ పథకాలు సి ఎం ఆర్ ఎఫ్ (సీఎం రిలీఫ్ ఫండ్),కల్యాణ లక్ష్మీ, ఆపద సమయంలో ఎల్ ఓ సి తదితర కార్యక్రమాలు నిస్వార్థంగా చేశానని ఈ వార్డ్ ప్రజలు తన సేవలను గుర్తించి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a Reply