TG | అభివృద్ది పథంలో భూపాలపల్లి …

TG | అభివృద్ది పథంలో భూపాలపల్లి …
— మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి
— కాంగ్రెస్ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలి
— ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
— మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ను దీవించాలి
— భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
— 16, 17, 29 వార్డుల్లో కార్నర్ మీటింగ్
TG | ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : రాష్ట్రంలోనే భూపాలపల్లి మున్సిపాలిటీనీ సీఎం సహకారము అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నానని, అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో 30వార్డుల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టులు బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులు దాట్ల విజయ శ్రీనివాస్, బీర్తి రమాదేవి, పుల్ల మహేష్ కు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీ, రామ్ నగర్, 16,17,29 వార్డుల్లో కార్నార్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల ప్రభుత్వం పని చేస్తుందని గత 25 నెలల్లో భూపాలపల్లి మున్సిపాలిటీని కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.
రాష్ట్రంలో మున్సిపాలిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పదేళ్లు పాలించిన బిఆర్ ఎస్ వాళ్లకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ లు, తాగునీరు, సదుపాయాలు కల్పిస్తున్నామని, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంరమ్మ ఇండ్లు అందించడం జరిగిందన్నారు. 30 వార్డుల్లో మరింత అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అందుకు కాంగ్రెస్ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ముఖ్య నాయకులు ఆయా వార్డుల అభ్యర్థులు దాట్ల విజయ శ్రీనివాస్, బీర్తి రమాదేవి, పుల్ల మహేష్, ఎన్నికల ఇంచార్జీ లు పాల్గొన్నారు.
