
TG | రాజాపేటలో భయాందోళనలు..
TG | రాజాపేటలో భయాందోళనలు..
TG |యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి : గత 15 రోజులుగా పెద్దపులి జాడను అటవీ శాఖ అధికారులు పట్టుకోలేకపోతున్నారు. రోజుకొక లేగదూడను చంపుతూ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి, రాజాపేట అటవీ ప్రాంతంలోనే నివాసన్ని ఏర్పర్చుకుంది. మంగళవారం రాజాపేట మండలం బసంతాపురం గ్రామానికి చెందిన కట్కూరి రమేష్ బాయి దగ్గర లేగ దూడను పులి పట్టింది. దాని మెడలు కొరికేసి రక్తం తాగి వెళ్లిపోయింది. బసంతాపురం, లక్ష్మక్కపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో రైతులు పులి అడుగులను గుర్తించారు. దీంతో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు త్వరగా పెద్దపులిని పట్టుకోవాలని కోరుతున్నారు.

