TG | చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..

TG | చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..
TG | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నాని విజయవంతం చేయాలని టీఎస్ యుటీతఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రవిప్రసాద్ గౌడ్, డి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ ఆవరణంలో హైజాక్ ఆధ్వర్యంలో జరిగే చలో పార్లమెంట్ మార్చ్ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉపాధ్యాయులకు శాపంగా మారిన టెట్, సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం -2020 ఉపసంహరించుకోవాలని, టాక్స్ స్లాబ్ రేట్లు పెంచాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజారాం ప్రకాష్, టిఎస్ యుటిఎఫ్ నాయకులు తిమ్మప్ప, బక్కన్న,వెంకటేశ్వర్లు అయోధ్య రాముడు, ఎల్లస్వామి డి రాము, శివుడు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
