TG | కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…

TG | కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…

TG | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని సాయి బాబా మందిరం ఆవరణలో జరిగిన చేరికల కార్యక్రమంలో సుమారు 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం గుడిహత్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఆడే షీలా గారి ఆధ్వర్యంలో, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ గారి సమక్షంలో, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ గారి నాయకత్వంలో జరిగింది.

మండల సామాజిక కార్యకర్త ఆడే జైపాల్ గారు, ముగ్గురు ఉపసర్పంచ్‌లతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య గారితో కలిసి ఆడే గజేందర్ గారు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆడే గజేందర్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని, పార్టీలో చేరిన వారికి తగిన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply