TG |పెద్దపల్లిలో వెలువెత్తిన నిరసనలు

TG | పెద్దపల్లిలో వెలువెత్తిన నిరసనలు
- బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్
TG | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పై పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. ఆదివారం జిల్లా కేంద్రంలో గులాబీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యమ నాయకుడి పై రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. రాజీవ్ రహదారి పై బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు గులాబీ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం తెచ్చిన కెసిఆర్ ను ప్రభుత్వం వేధించడం సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తుందని, ఎలాంటి పసలేని ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం వెంటనే రాజకీయ వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి, ఉప్పు రాజ్ కుమార్, మోబిన్, బిక్షపతి, జహీర్, వెన్నం రవీందర్ తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
