TG : రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఈ పోస్టులు మంజూరు చేస్తే తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు , మాజీ వీఆర్ఏ ల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆర్థిక శాఖ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *