Tension | బోడమంచతండాలో ఉద్రిక్తత

Tension | బోడమంచతండాలో ఉద్రిక్తత

తండావాసులు-పోలీసుల మధ్య తోపులాట..

ఇద్దరు పోలీసులకు గాయాలు


Tension | మహబూబాబాద్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచతండాలో ఉద్రిక్త పరిస్థితులు (Tension) నెలకొన్నాయి. తండా వాసులు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

నిన్న తండాలో జరిగిన ఒక హత్యకు ప్రతీకారంగా స్థానిక తండావాసులు ఆందోళనకు దిగారు. హత్య కేసు (Murder Case) లో అనుమానితులు వచ్చిన బైకును ఆందోళనకారులు దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు (police) ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేశారు. అయితే తండా వాసులతో తోపులాట జరగడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హత్య కేసు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో తండా ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply