నీరా కేఫ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం

నీరా కేఫ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం
మంథని, ఆంధ్రప్రభ : హైదరాబాదులో గల నీరాకేఫ్ రెండు సంవత్సరాల పాటు నిర్వహించడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు మంథని ఎక్సైజ్ అధికారి రాకేష్ మంగళవారం ఒక ప్రకటనలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విధివిధానాలను వివరించారు. గీత పారిశ్రామిక సంఘాల నుంచి టెండర్ ఆహ్వానించడమైనదని, అట్టి టెండర్కు రూ. 1, 000 లు ఎండి టీజీ టిఓడిడివై టాపర్స్ సిఓ ఓపి ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ (నీరాక్ కేఫ్) పేరిట డిడి తీయాలని సూచించారు.
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సర్టిఫికెట్, లైసెన్స్, కుల ధ్రువీకరణ పత్రం, ఐడి ప్రూఫ్, ఈ ఎండి రూ. రెండు లక్షలు, సొసైటీ తీర్మానం చేసిన లెటర్, అవసరం ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు బిడ్ ఎందు పాల్గొనవచ్చు అని సూచించారు. బిడ్ ఫైలింగ్ చివరి తేదీ ఈ నెల 18, ఓపెన్ చేసే తేదీ ఈ నెల 28 వివరించారు. మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. టీజీటీసిఎఫ్సి . కామ్ వెబ్సైట్ యందు, దగ్గరలోని ఎక్సైజ్ స్టేషన్ యందు సంప్రదించగలరని సూచించారు.
