Tenali | ట్రైన్ డీ కొని మహిళ మృతి
తెనాలిక్రైమ్,ఫిబ్రవరి 16(ఆంధ్రప్రభ):రూరల్ మండలం కొలకలూరు గ్రామ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ ఢీకొని ఆదివారం మహిళ మృతి చెందారు.
స్థానికులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ గ్రామానికి చెందిన బొద్దులూరి పద్మావతి( 55) రైల్వే స్టేషన్లో విజయవాడ నుంచి ఒంగోలు పాసింజర్ ఎక్కే క్రమంలో పట్టాలు దాటుతుండగా మరొక ట్రాక్ పై విజయవాడ నుంచి వెళ్ళున్న సూపర్ ఫాస్ట్ ఎస్ప్రెస్ డీకొనటంతో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందారు.ఉదయం పూట మంచు కారణంగా ట్రైన్ కనపడకపోవడంతో జరిగిన ఘటనగా స్థానికులు చెబుతున్నారు.