Temple |సంక్రాంతి పూజలు

సంక్రాంతి పూజలు
ఆలేరు శ్రీరంగ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
Temple |ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో అపర శ్రీరంగంగా పేరొందిన ప్రసిద్ధ శ్రీవైష్ణవాలయమైన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి దివ్య క్షేత్రంలో ఈ రోజు మకర సంక్రాంతి విశేష పూజలు జరిగాయి. ప్రత్యేక అలంకరణలో శ్రీ రంగనాయక స్వామి శ్రీ లక్ష్మీ గోదా సమేతుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి, వరదరాజు ఆధ్వర్యంలో పూజలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మకర సంక్రాంతి విశిష్టతను భక్తులకు ఆలయ అర్చకులు వివరించారు. ఆలయ చైర్మన్ మోర్తల గోపాల్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
