temple | కార్తీక మాస పూజలు ఎంతో పవిత్రం….

temple | కార్తీక మాస పూజలు ఎంతో పవిత్రం….

temple | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : కార్తీక మాసంలో శివునికి చేసే పూజలు ఎంతో పవిత్రమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్(Ashish Sangwan) అన్నారు. ఈ రోజు రాత్రి మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయంలో ఆయన కార్తీక మాస ముగింపు పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు రామగిరి శర్మ, రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం(temple premises)లో జరిగిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పారు .

పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు లింబాద్రి(Limbadri) పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఆలయంలో చేపట్టే పనులు విషయంపై సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ ఆధ్వర్యంలో వెలిగించిన దీపాలు ఎంతో ఆకర్షణగా భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీధర్ ,మండల అభివృద్ధి అధికారి రాజ్ కిరణ్ రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య, ఆలయ పునర్నిర్మాణ కమిటీ పాలకవర్గ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply